రెడ్డి దొర, పొట్టి దొర, చెతకాని వెధవ .. రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అన్న సామెత చాలా మందికి , చాలా రంగాలకు వర్తిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజకీయంగా దెబ్బతిన్న నేతలు ఎంతోమంది ఉన్నారు. దశాబ్ధాలుగా రాజకీయాలను శాసించి, కీలక పదవులను అనుభవించి ఓ వెలుగు వెలిగిన వారంతా ఫేడవుట్ అయిపోయారు. జీవితంలో ఎంతో చూసి ఇప్పుడు ఖాళీగా కూర్చోవడమంటే కష్టమే. అలాంటివారిలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు.
తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా .. ఎన్టీఆర్, చంద్రబాబులకు అత్యంత సన్నిహితుడిగా మోత్కుపల్లికి పేరుంది. 1982లో అన్నగారి పిలుపుమేరకు టీడీపీలో చేరిన ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి వరుసగా గెలిచారు నర్సింహులు. 1989 సమయంలో జిల్లాకే చెందిన ఎలిమినేటి మాధవరెడ్డితో వైరం కారణంగా టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదని అంటారు. అయినప్పటికీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సొంత పార్టీ అభ్యర్ధినే ఓడించి తన పట్టు నిరూపించుకున్నారు. దళిత నేత కావడంతో పాటు తన వాగ్థాటి, విమర్శలతో విరుచుకుపడటం నర్సింహులు స్టైల్.
తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో వున్న సమయంలో ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా, భూగర్భ గనులు, విద్యుత్, టూరిజం, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగానూ పనిచేశారు. ఆలేరు నియోజకవర్గంలో వున్న పట్టు, ప్రజలతో వున్న పరిచయాలతో పదవిలో వున్నా , లేకున్నా గళమెత్తుతూ వుంటారు మోత్కుపల్లి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. టీడీపీని వీడి బీజేపీ, బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఎక్కడా మోత్కుపల్లి నర్సింహులు ఇమడలేకపోతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా.. సొంత పార్టీనే ఆయన టార్గెట్ చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం మాదిగ సామాజికవర్గానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కేటాయించకపోవడంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తనను చంపినట్లేనని.. మనల్ని పార్టీ ఎందుకు గుర్తించడం లేదంటూ కంటతడి పెట్టారు. రేవంత్ రెడ్డి పుట్టకముందే తాను ఎమ్మెల్యేనని.. ఆయన బెదిరింపులకు భయపడేది లేదన్నారు. మాదిగలను కాంగ్రెస్ అవమానపరిచిందని మోత్కుపల్లి మండిపడ్డారు.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసిన మోత్కుపల్లి నర్సింహులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్డి దొర, పొట్టి దొర.. నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా .. మోత్కుపల్లి ఇండిపెండెంట్‌గగా గెలిచాడని చెప్పారు. నువ్వేదో పీకుడుగాని లెక్క మాట్లాడుతున్నావ్.. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వవా, నువ్వు మొగోనివా అంటూ మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు వుంటావ్.. మాదిగ బిడ్డలు నీకు కర్రు కాల్చి వాత పెడతారని నర్సింహులు హెచ్చరించారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాడని.. కానీ చేసేది శూన్యమని రేవంత్ రెడ్డి చెతకాని వెధవ అంటూ మోత్కుపల్లి మండిపడ్డారు.
ఆయన తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలోనూ వుండేటట్లు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ సీరియస్‌గా తీసుకుంటే మోత్కుపల్లి పరిస్ధితేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు తిరిగిన ఆయన.. ఒకవేళ కాంగ్రెస్ వేటు వేస్తే ఎక్కడికి వెళ్తారంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
రేవంత్ రెడ్డి చాతకాని వెధవ
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.. అంత మొగోడివా నువ్వు.
ఎన్ని రోజులు ఉంటావు నువ్వు రేవంత్ రెడ్డి.. కర్రు కాల్చి వాత పెడతారు నీకు నా మాదిగ సోదరులు.
80 లక్షలున్న నా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా, పట్టుమని 10… pic.twitter.com/M8bcBoQ18y

Comments
Post a Comment